: టీఆర్ఎస్ తగవులపై నరేంద్రమోదీతో మాట్లాడా: చంద్రబాబు
చీటికీ మాటికీ తగవులకు వస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిపై తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడానని కృష్ణా జిల్లా పర్యటనలో చంద్రబాబు పేర్కొన్నారు. ''అందరం తెలుగువాళ్లం... ఇద్దరి మధ్య గొడవలు వద్దని చెప్పా... అభివృద్ధిలో పోటీపడదామన్నా... సమస్యలు వచ్చినప్పుడు చర్చలతో పరిష్కరించుకుందామన్నా, కానీ టీఆర్ఎస్ ప్రతి విషయానికీ అనవసరమైన గొడవ చేస్తోంది. ఇందువల్ల సమస్యలు నాకే కాదు, వారికీ వస్తాయి'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తాను మాట్లాడానని ఆయన అన్నారు. త్వరలోనే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని మోదీ తనకు హామీ ఇచ్చారని చంద్రబాబు అన్నారు.