: నేడు నల్గొండ జిల్లా బంద్... పిలుపునిచ్చిన టీడీపీ
శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి తెలంగాణలోని టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య చిచ్చు రాజేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే తెలంగాణకు విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో, నిన్న నల్గొండలోని టీడీపీ కార్యాలయాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఫర్నిచర్ కు నిప్పు పెట్టారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ అరాచకాలను నిరసిస్తూ... ఈ రోజు నల్గొండ జిల్లా బంద్ కు టీటీడీపీ పిలుపునిచ్చింది.