: టీడీపీ ఆఫీసుపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని తప్పుబట్టిన జానారెడ్డి
నల్గొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని కాంగ్రెస్ నేత జానారెడ్డి తప్పుబట్టారు. అధికారంలో ఉన్నామని ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదని హితవు పలికారు. కార్యాలయాన్ని తగలబెట్టడమేంటని ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.