: ప్రధానికి పుస్తకం బహూకరించిన రామోజీరావు
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి రామోజీరావు అధ్యాత్మిక పుస్తకాన్ని బహుకరించారు. రామోజీరావుతో పాటు ఈనాడు ఎండీ కిరణ్, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి కూడా మోడీని కలిశారు. అనంతరం, రామోజీరావు కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, వెంకయ్య నాయుడు, ప్రకాశ్ జవదేకర్ తదితరులను కూడా కలిశారు. అయితే, రామోజీరావు వారితో ఎందుకు భేటీ అయ్యారన్న వివరాలు తెలియరాలేదు.