: ఓటర్లలో అత్యధికుల అభిప్రాయం ఇదే!
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందుభి మోగించడం తెలిసిందే. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్) సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అందులో భాగంగా ఓటర్ల అభిమతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ప్రతి ఐదుగురిలో ముగ్గురు, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీయే రాష్ట్రంలోనూ అధికారంలో ఉంటే అభివృద్ధి జరుగుతుందని చెప్పారట. అభ్యర్థుల నాయకత్వ పటిమ గానీ, సీఎం అభ్యర్థి అంశం గానీ ఓటర్లకు ప్రాధాన్య అంశాలుగా కనిపించలేదట. కేవలం అభివృద్ధి అంశమే వారిని ప్రభావితం చేసిందని ఈ సర్వే చెబుతోంది.