: బీజేపీ విజయం జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై ప్రభావం చూపుతుంది: ఒమర్ అబ్దుల్లా


హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయం జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కొంత ప్రభావితం చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే, గతంలో అనుకున్నంత ప్రభావం ఉండదని చెప్పారు. ఈ మేరకు ఒమర్ మీడియాతో మాట్లాడుతూ, "సహజంగానే జమ్మూకాశ్మీర్ ఎన్నికలపై బీజేపీ ప్రభావం చూపుతుంది" అని పేర్కొన్నారు. కాగా, 'హర్యానాలో అత్తెసరు మార్కులతో పాసైనట్టు విజయం సాధించినప్పటికీ, మహారాష్ట్రలో మాత్రం మరొకరిపై ఆధారపడితేనే కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు' అన్నారాయన.

  • Loading...

More Telugu News