: పక్క రాష్ట్రాలు కరెంట్ ఇస్తామంటున్నా టీఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: మంత్రి దేవినేని


తెలుగు రాష్ట్రాలు రెండూ కలసి రైతుల కష్టాలను తీర్చాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కృష్ణా జలాలను కాపాడుకుంటూ రైతులను ఆదుకోవాలని చెప్పారు. శ్రీశైలం జల విద్యుదుత్పత్తిని నిలిపివేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్గొండలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. ఈ ఘటనను మీడియా ముఖంగా ఖండించిన మంత్రి, విద్యుత్ అంశంపై తాను మంత్రి హరీశ్ రావుకి ఫోన్ చేసి అడిగినా ఇంతవరకు స్పందన రాలేదన్నారు. పక్క రాష్ట్రాలు విద్యుత్ ఇస్తామంటున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి తమ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ఉమ చెప్పారు.

  • Loading...

More Telugu News