: దమ్ముంటే బాబు ఇంటి ముందు ధర్నా చేయండి: టీటీడీపీ నేతలకు పోచారం సూచన
శ్రీశైలంలో విద్యుదుత్పత్తిని నిలిపి వేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని టీఎస్ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలోని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్నదే బాబు లక్ష్యమని అన్నారు. తెలంగాణ టీడీపీ నేతలకు దమ్ముంటే చంద్రబాబు ఇంటి ముందు ధర్నా చేయాలని... తెలంగాణకు విద్యుత్ వచ్చేలా చేయాలని సూచించారు.