: తూ.గో. జిల్లా బాణాసంచా బాధితులకు చంద్రబాబు పరామర్శ


తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా పేలుడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న సీఎం... అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కాకినాడకు వెళ్లారు. ముందుగా బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రభుత్వం తరపున సాయం చేస్తామని బాబు చెప్పారు. అనంతరం కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్ద మృతదేహాలను పరిశీలించారు. మరోవైపు బాణాసంచా ఘటనలో ఈ ఉదయం వరకు పదహారు మంది చనిపోయారు. ముగ్గురు అక్కడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • Loading...

More Telugu News