: తెలంగాణ ఉద్యోగులకు రేపు హెల్త్ కార్డులు: కేసీఆర్
తెలంగాణ ఉద్యోగులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఉద్యోగులందరికీ రేపు హెల్త్ కార్డులు ప్రారంభిస్తామని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని చెప్పారు. వైద్య ఖర్చులపై పరిమితిని కూడా ఎత్తేస్తున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఉద్యోగులందరూ మరింత అంకిత భావంతో పని చేయాలని... ప్రభుత్వ ఆదాయం పెరిగేందుకు కృషి చేయాలని అన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కోరిక మేరకు పని గంటలతో సంబంధం లేకుండా... ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.