: టీఎస్ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఏపీ ఇరిగేషన్ శాఖ
తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ నీటి పారుదల శాఖ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి వినియోగంలో నిబంధనలు, ఒప్పందాలకు కేసీఆర్ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఆరోపిస్తూ, కేంద్రానికి లేఖ రాసింది. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని... తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేసింది. లేఖ కాపీని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖకు కూడా పంపింది.