: శ్రీలంకతో వన్డే సిరీస్ కు వేదికలు ఖరారు


శ్రీలంక క్రికెట్ జట్టుతో కుదుర్చుకున్న ఐదు వన్డేల సిరీస్ కు బీసీసీఐ వేదికలు ఖరారు చేసింది. ఈరోజు జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్ కత, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు వన్డేలు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. అయితే, తొలి మూడు మ్యాచ్ లకు కెప్టెన్ ధోనీకి విశ్రాంతి ఇస్తున్నట్లు బోర్డు చెప్పింది. భారత్ తో వన్డేలకు ఒప్పుకున్నందుకు లంక బోర్డుకు అభినందనలు తెలిపింది. ఇండియాతో జరుగుతున్న సిరీస్ నుంచి వెస్టిండీస్ ఆటగాళ్లు అర్ధాంతరంగా తప్పుకోవడంతో... వెంటనే, శ్రీలంకతో సిరీస్ ను ఖరారు చేసుకుంది బీసీసీఐ.

  • Loading...

More Telugu News