: 'గాలి' రిమాండ్ ను పొడిగించిన సీబీఐ కోర్టు
అక్రమ మైనింగ్ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ అధినేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి రిమాండ్ ను హైదరాబాదులోని సీబీఐ ప్రతేక న్యాయస్థానం పొడిగించింది. ఆయనతో పాటు బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ ల రిమాండ్ ను కూడా నవంబర్ 20 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం, గనులశాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ కూడా విచారణకు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు రాలేకపోతున్నట్టు పిటిషన్ దాఖలు చేయగా... కోర్టు అనుమతించింది. వచ్చే నెల 20వ తేదీ వరకు ఓఎంసీ కేసును కోర్టు వాయిదా వేసింది.