: హర్యానా సీఎం రేసులో మనోహర్ లాల్ ఖత్తర్


ఉత్తరాది రాష్ట్రం హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేసులో ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ మనోహర్ లాల్ ఖత్తర్ పేరు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కమలదళం ముఖ్య నేత ఒకరు మాట్లాడుతూ, "దాదాపుగా ఆయన పేరును మేము నిర్ణయించాము" అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనుచరుడైన ఖత్తర్ కు సంఘ్ మద్దతు కూడా బాగా ఉండటంతో ఈయననే ఖరారు చేస్తారని సమాచారం. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖత్తర్ తరువాత బీజేపీలో చేరారు. అరవైఏళ్ల వయసున్న ఖత్తర్ ఇప్పటికీ బ్రహ్మచారే. తాజా ఎన్నికల్లో హర్యానాలోని కర్నాల్ స్థానం నుంచి గెలిచిన ఈ సీనియర్ నేత, పార్టీ లోక్ సభ ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా కూడా పని చేశారు. మరోవైపు, సీఎం పదవికి జాట్ వర్గానికి చెందిన కెప్టెన్ అభిమన్యు సింగ్ పేరు కూడా వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News