: సత్య నాదెళ్ల 2014 వేతనం... 11.6 మిలియన్ డాలర్లు!


మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల 2014లో 11.6 మిలియన్ డాలర్లను వేతనంగా అందుకున్నారు. కంపెనీ స్టాక్ అవార్డుల ద్వారా లభించిన 79.78 మిలియన్ డాలర్లను కలుపుకుంటే ఈ మొత్తం 91.38 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఇటీవల వేతనాల పెంపు విషయంలో మహిళా ఉద్యోగులు కర్మను నమ్ముకోవాలంటూ వ్యాఖ్యానించి వివాదంలో చిక్కుకున్న సత్య నాదెళ్ల, కర్మను నమ్ముకున్నందుకే ఈ మేర భారీ ప్యాకేజీకి అర్హత సాధించారని పారిశ్రామిక వర్గాలు భావిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ లో జూలై 1 నుంచి జూన్ 30 దాకా ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే, 2013 ఆర్థిక సంవత్సరంలో 7.67 మిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని అందుకున్న సత్య నాదెళ్ల, 2015 ఆర్థిక సంవత్సరంలో 18 మిలియన్ డాలర్లను అందుకోనున్నారు. అంటే, ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి సీఈఓగా పనిచేసే సత్య నాదెళ్ల కు 18 మిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీ అందనుందన్న మాట.

  • Loading...

More Telugu News