: బీసీసీఐ కీలక సమావేశం ప్రారంభం... విండీస్ పై చర్యలే ప్రధాన అంశం


హైదరాబాదులో బీసీసీఐ కార్యవర్గ సమావేశం ప్రారంభమయింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సంబంధించే ఈ భేటీలో ప్రధాన చర్చ జరగనుంది. భారత పర్యటన నుంచి విండీస్ క్రికెటర్లు అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. వేతనాల విషయంపై తమ బోర్డుతో విభేదించిన విండీస్ ఆటగాళ్లు సిరీస్ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. దీంతో, బీసీసీఐకి భారీ నష్టం వాటిల్లింది. టూర్ షెడ్యూల్ ను శ్రీలంకతో భర్తీ చేసుకున్నప్పటికీ... బీసీసీఐకి భారీగానే నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని విండీస్ బోర్డ్ నుంచి రాబట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. లేనిపక్షంలో, విండీస్ బోర్డుపై తీవ్ర చర్యలకు కూడా బీసీసీఐ వెనుకాడకపోవచ్చు. అవసరమైతే, ఐదేళ్ల పాటు విండీస్ తో క్రికెట్ ఆడకపోయే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. ఇదే జరిగితే, విండీస్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా పెను నష్టం వాటిల్లినట్టే. ఆర్థికంగా అత్యంత బలవంతమైన బీసీసీఐతో పెట్టుకుంటే, ఏ దేశ క్రికెట్ బోర్డు కూడా సాఫీగా ముందుకు సాగలేని పరిస్థితులు కొన్నేళ్ల క్రితమే ఏర్పడ్డాయి. ఈ సమావేశానికి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News