: ‘ఉగ్ర’ దాడులను కొట్టిపారేయలేం: కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్
దీపావళి సందర్భంగా దేశంలో ఉగ్రవాద దాడులను కొట్టిపారేయలేమని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఏమాత్రం అలక్ష్యం చేయడం లేదని చెప్పిన ఆయన ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. వినాయక చవితి, దుర్గా పూజ సందర్భంగా పలు రాష్ట్రాల్లో ఈ తరహా దాడులు జరిగిన విషయం తెలిసిందేనని, తాజాగా దీపావళి సందర్భంగానూ ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని తెలిపారు. నిఘా వర్గాల నుంచి అందుతున్న సమచారం ప్రకారం రాష్ట్రాలను అప్రమత్తం చేయడం సాధారణంగా జరుగుతున్నదేనని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.