: జగన్ కేసులో విచారణ నవంబరుకి వాయిదా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను నవంబరు 20కి న్యాయస్థానం వాయిదా వేసింది. తుపాను బాధితుల పరామర్శ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి జగన్ కు మినహాయింపు ఉండగా... మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, అయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, పునీత్ దాల్మియా, ఐఏఎస్ లు శాంబాబు, శామ్యూల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.