: ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డే'పై ఎలాంటి దర్యాప్తు లేదు: నిర్మలా సీతారామన్


దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డే' డిస్కౌంట్ ఆపర్లపై వచ్చిన ఫిర్యాదులపై ఎలాంటి విచారణ జరపడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఫ్లిప్ కార్టుపై ఎలాంటి ప్రణాళికాబద్ధమైన దర్యాప్తు ఉండదని స్పష్టం చేశారు. కొన్ని రోజుల కిందట పలువురు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, చాలామంది ఆందోళన వ్యక్తం చేశారని, దీనిపై పరిశీలిస్తామని మంత్రి చెప్పారు. అయితే, ఫ్లిప్ కార్ట్ అంశంపై గతంలో తాను చేసిన మూడు వ్యాఖ్యలను ముప్పై లక్షల విధాలుగా తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News