: ‘సేన’తో పొత్తు లేకుండానే... బీజేపీ ‘మహా’ ప్రభుత్వం!


సుదీర్ఘ కాల మిత్రపక్షం శివసేన ఎన్నికల సందర్భంగా మొండికేయడంతో ఒంటరిగానే మహారాష్ట్ర బరిలోకి దిగిన బీజేపీ సత్తా చాటింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో నిలిచిన బీజేపీకి, ఏదో ఒక పార్టీ మద్దతు లేనిదే పీఠం దక్కే పరిస్థితి లేదు. అయితే బయటి నుంచి మద్దతు ప్రకటించిన ఎన్సీపీతో కలిసి సాగేందుకు బీజేపీ ఎందుకనో తటపటాయిస్తోంది. ఇదే అదనుగా శివసేన మళ్లీ తెరపైకొచ్చి, ఎన్నికల నాడు చేసిన మొండి వాదననే మళ్లి వినిపిస్తోంది. కేబినెట్ లో సగం బెర్తులు తమకిస్తే, మద్దతిస్తామంటూ బేరసారాలకు దిగింది. దీంతో రెండు రోజుల పాటు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోగా రెండు పార్టీల మధ్య మరింత దూరాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదని భావించిన బీజేపీ, మహారాష్ట్రలో మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దాదాపు సిద్ధమైంది. బయటి నుంచి మద్దతివ్వడానికి ఎలాగూ ఎన్సీపీ రెడీగా ఉంది. మిగిలిన చిన్న పార్టీలూ మద్దతు తెలిపేందుకు సుముఖంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ దిశగా పార్టీ నిర్ణయం తీసుకుందని సీఎం రేసులోని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. తమ బలంలో సగం మంది సభ్యులున్న శివసేనకు కేబినెట్ లో సగం వాటా ఎలా ఇస్తామంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News