: బీచ్ లో వ్యర్థాలను తొలగించిన పురంధేశ్వరి
కేంద్ర మాజీమంత్రి పురంధేశ్వరి, బీజేపీ ఎంపీ హరిబాబు 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సంస్థల ప్రతినిధులు, బీజేపీ కార్యకర్తలతో కలసి వైజాగ్ బీచ్ లోని వ్యర్థాలను తొలగించారు. అంతేకాకుండా, బీచ్ పరిశుభ్రతకు విశాఖ వాసులందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 'స్వచ్ఛ విశాఖ' పేరుతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. హరిబాబు మాట్లాడుతూ, తుపాను వల్ల అస్తవ్యస్థమైన విశాఖలో ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయని... మరో రెండు, మూడు రోజుల్లో విశాఖ నగరం మొత్తం పరిశుభ్రమవుతుందని చెప్పారు.