: డాలర్ శేషాద్రి మళ్లీ యాక్టివ్!
ఇటీవల తీవ్ర గుండెపోటుతో మరణం అంచుల వరకు వెళ్లిన డాలర్ శేషాద్రి మళ్లీ చురుగ్గా తన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్వామి వారి సన్నిధిలో నిత్యం గడుపుతూ, యథావిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో లాగే, వీఐపీ ప్రముఖులు వచ్చినప్పుడు డాలర్ శేషాద్రి వారికి స్వాగతం పలుకుతున్నారు. వారందరూ ముందుగా తిరుమలకు రాగానే డాలర్ శేషాద్రిని కలుసుకుని ఆయన ఆరోగ్యపరిస్థితిని వాకబు చేస్తున్నట్టు సమాచారం. శ్రీవారి ఆశీస్సులతోనే తన ప్రాణాలు నిలిచాయని, ఇది తనకు పునర్జన్మ అని ఆయన వారితో చెబుతున్నట్టు తెలుస్తోంది. డాలర్ శేషాద్రి మళ్లీ చురుగ్గా తిరుగుతుండటం చూసి, టీటీడీ సిబ్బంది కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.