: విచారణ జరుగుతుండగా జడ్జిపైకి మలం విసిరిన ఖైదీ


తమిళనాడుకు చెందిన ఓ జడ్జిపై ఓ ఖైదీ మలం విసిరి సంచలనం సృష్టించాడు. వివరాల్లోకి వెళితే, దొంగతనం ఆరోపణపై జులై 27న మేలదయిల్ పట్టి గ్రామస్థుడు భాగ్యరాజ్ అరెస్ట్ అయ్యాడు. సోమవారం, ఈ కేసు విచారణకు వచ్చింది. విరుద్ నగర్ సొత్తూర్ లోని స్థానిక కోర్టులో విచారణ జరుగుతుండగా హఠాత్తుగా భాగ్యరాజ్ తన దగ్గర ఉన్న చిన్న సంచిలోంచి మలాన్ని తీసి జడ్జి పైకి విసిరాడు. దీంతో, కోర్టు ప్రాంగణంలోని వారంతా షాక్ కు గురయ్యారు. భాగ్యరాజ్ ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, నిందితుడు అసలు మలాన్ని కోర్టు లోపలికి ఎలా తీసుకురాగలిగాడన్న విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News