: ముంబైలో 'ఇసిస్' సానుభూతిపరుడి అరెస్ట్


సిరియా, ఇరాక్ లలో బీభత్సం సృష్టిస్తున్న ఇసిస్ టెర్రరిస్టు సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నాడని భావిస్తున్న ఓ వ్యక్తిని సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీపావళి సందర్భంగా ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో బాంబు దాడులకు దిగేందుకు కూడా అతడు సిద్ధమయ్యాడని పోలీసులు నిర్ధారించారు. దీంతో ముంబైలో ఒక్కసారిగా కలకలం రేగింది. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల అనీస్ అన్సారీ, ఇటీవలి కాలంలో ఇసిస్ కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. ఈ క్రమంలో ఆ సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వారితో పరిచయాలు పెంచుకున్నాడు. తమపై వైమానిక దాడులతో విరుచుకుపడుతున్న అమెరికాకు బుద్ధి చెప్పేందుకు, ముంబైలోని ఆ దేశానికి చెందిన కార్యాలయాలపై దాడులు చేయాలని ఇసిస్ ఉగ్రవాదులు తీర్మానించారు. ఇందులో భాగంగా సదరు సంస్థ తరపున దాడులను నిర్వహించేందుకు అనీస్ ఒప్పుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీపావళి పర్వదినాన ముంబైలో దాడులు జరిగేందుకు కుట్ర జరిగిందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News