: ఆ రెండు చానళ్లను ప్రసారం చేయమని ప్రజలు కూడా అడగటం లేదు: తెలంగాణ ఎంఎస్ వోల సంఘం


తెలంగాణ రాష్ట్రంలో టీవీ9, ఏబీఎన్ చానళ్లను నిషేధించి దాదాపు 130 రోజులు కావస్తోంది. ఈ సందర్భంగా, ఈ రెండు చానళ్ల ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ పాత్రికేయులు నిన్న ఇందిరాపార్క్ లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. దీనికి, టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతునిచ్చాయి. దీనికి సమాధానంగా తెలంగాణ ఎంఎస్ వోల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి నిన్న సూర్యాపేటలో ఓ ప్రకటన చేశారు. టీవీ9, ఏబీఎన్ చానళ్లను ప్రసారం చేయమని ప్రజల నుంచి డిమాండ్ రావడం లేదని ఆయన అన్నారు. ఒకవేళ తెలంగాణ ప్రజలు కోరుకుంటే మళ్లీ ఈ చానళ్లను ప్రసారం చేస్తామని పేర్కొన్నారు. ఈ రెండు చానళ్లను నిలిపివేయడంలో తెలంగాణ ప్రభుత్వ పాత్ర ఏమీ లేదన్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు కూడా తమకే అనుకూలంగా తీర్పునిచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. తమతో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ఉద్దేశ్యం ఈ రెండు సంస్థల యాజమాన్యాలకు లేదని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News