: సినీ పరిశ్రమలో గూండాయిజం నడుస్తోంది: దాసరి


సినీ పరిశ్రమలోని లోపాలను ఎత్తి చూపడంలో ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందుంటారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నో సంచలనం సృష్టించాయి. ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి సినీ పరిశ్రమపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో గూండాయిజం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. 'లౌక్యం' సినిమా విజయవంతంగా నడుస్తున్నప్పటికీ... ఓ అగ్ర హీరో సినిమా కోసం దాన్ని తీసివేశారని ఆరోపించారు. అయితే, ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి పరిస్థితులను గతంలో తానెన్నడూ చూడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో 'లక్ష్మీ రావే మాయింటికి' అనే సినిమా ఫంక్షన్లో పాల్గొన్న దాసరి ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News