: పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించాం: ఏపీ హోం మంత్రి
తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలోని బాణాసంచా తయారీ కేంద్రంలో ఈ మధ్యాహ్నం సంభవించిన పేలుడు ఘటనపై విచారణకు ఆదేశించామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప తెలిపారు. ఈ తయారీ కేంద్రంలో పరిమితికి మించి కార్మికులు పని చేస్తున్నారని చెప్పారు. క్షతగాత్రులకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల వంతున ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.