: ఎన్సీపీ నిర్ణయంతో విభేదించిన కేరళ ఎన్సీపీ విభాగం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి బేషరతుగా మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తమ అధినాయకత్వం నిర్ణయంతో కేరళ ఎన్సీపీ విభాగం విభేదిస్తోంది. ఇది పూర్తిగా అవకాశవాదం కిందకు వస్తుందని సీనియర్ ఎమ్మెల్యే ఏకే శశీంద్రన్ అన్నారు. రాష్ట్ర విభాగాలను సంప్రదించకుండా... ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని పార్టీ ముఖ్య నేతలకు ఇప్పటికే తెలిపానని అన్నారు. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల్లోకి తప్పుడు అభిప్రాయం వెళుతుందని తెలిపారు.