: నష్టాన్ని సరిగా అంచనా వేయలేదంటున్న జగన్


హుదూద్ తుపాను నష్టాన్ని అధికారులు సరిగా అంచనా వేయలేదంటున్నారు వైఎస్సార్సీపీ అధినేత జగన్. విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెంలో ఆయన నేడు తుపాను బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ వద్దకు అధికారులెవరూ రాలేదన్న విషయాన్ని బాధితులు తనతో చెప్పారని వివరించారు. నష్టపోయిన రైతులకు నవంబర్ 5 లోగా పరిహారం చెల్లించకపోతే ఎమ్మార్వో కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. తీవ్రంగా నష్టపోయిన మత్స్యకారులను కూడా ఆదుకోవాలని ఆయన సర్కారును డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News