: ఆళ్లగడ్డలో పోటీ వద్దని వైకాపా అభ్యర్థించింది: కేఈ కృష్ణమూర్తి
ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయదని ఏపీ ఉపముఖ్యమంత్రి, టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ఎన్నికలో పోటీ చేయవద్దని వైకాపా కోరిందని... ఆ పార్టీ నేతలు మైసూరా తదితరులు ఇదే విషయమై తమను సంప్రదించారని చెప్పారు. పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, టీడీపీ ఎన్నికల బరి నుంచి తప్పుకుందని తెలిపారు.