: బ్రిటీష్ పార్లమెంటులో తనికెళ్ళ భరణి 'ప్యాసా'


తెలుగువారు గర్వించదగ్గ నటుల్లో తనికెళ్ళ భరణి ఒకరు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు. తన రచనా పాటవంతో ఎన్నో సినిమాలకు హిట్లు అందించారు భరణి. ఇటీవలే ఆయన 'ప్యాసా' పేరిట ఓ పుస్తకం రచించారు. ఇప్పుడా పుస్తకం ఖండాంతరాలకేగి, బ్రిటీష్ పార్లమెంటులో ఆవిష్కరణ జరుపుకోవడం విశేషం. ఓ తెలుగు పుస్తకం బ్రిటీష్ పార్లమెంటులో విడుదల కావడం తొలిసారి కాగా, దీనిపై తనికెళ్ళ భరణి స్పందిస్తూ, తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా, ప్యాసాను బ్రిటీష్ పార్లమెంటు వరకు తీసుకెళ్ళడంలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ప్రముఖ పాత్ర పోషించారు. తెలుగమ్మాయి ప్రశాంతి రెడ్డిని వివాహమాడి తెలుగింటి అల్లుడైన బ్రిటీష్ ఎంపీ డాన్ బైల్స్ కూడా ఈ విషయంలో సహకరించారట. బ్రిటన్ లోని తెలుగు సంఘం సభ్యులు కూడా భరణి పుస్తకావిష్కరణ అంశంలో తమ వంతు పాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News