: ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరుతో ఇంటర్ పరీక్ష రాస్తున్న విద్యార్థి


కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేరుతో ఓ విద్యార్థి ఇంటర్ పరీక్ష రాయడం సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే, తాడిగడపలోని ఎస్ కేవీఎస్ జూనియర్ కాలేజీలో సదరు విద్యార్థి పరీక్ష రాస్తుండగా విద్యార్థి సంఘాలకు సమాచారం అందింది. వెంటనే స్క్వాడ్ తో ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లాయి విద్యార్థి సంఘాలు. స్క్వాడ్ ని చూడగానే పరీక్ష రాస్తున్న విద్యార్థి పరారయ్యాడు. అయితే, బోడె ప్రసాద్ పేరుతో ఎవరూ పరీక్ష రాయలేదని ఇన్విజిలేటర్ తెలిపారు. కానీ, బోడె ప్రసాద్ పేరుతో అటెండెన్స్ షీట్, ఓఎంఆర్ షీట్ ఉన్నట్టు స్క్వాడ్ గుర్తించింది. మరో విషయం ఏమిటంటే, ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News