: ధోనీకి ఛాలెంజ్ విసురుతున్న అంధ క్రికెటర్


మహేంద్ర సింగ్ ధోనీ కొట్టిన సిక్సులు ఎందరో బౌలర్లకు పీడకలలు మిగిల్చాయి. అతడి భుజ బలం, బుద్ధి బలం అలాంటివి. అంతటి యోధుడిని సైతం ఓ పదిహేనేళ్ళ అంధ క్రికెటర్ సవాలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వివరాల్లోకి వెళితే... ధోనీ స్వస్థలం రాంచీకి చెందిన గోలూ కుమార్ పాక్షిక అంధుడు. ఈ విభాగంలో భారత క్రికెట్ జూనియర్ జట్టుకు ఎంపికైన 14 మందిలో గోలూ కూడా ఒకడు. నవంబర్ 24 నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరిగే అంధుల వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాల్గొంటోంది. జట్టులో అందరికంటే పిన్న వయస్కుడు గోలూనే. ఇప్పుడీ యువకెరటం ఏమంటున్నాడో వినండి. తనకు బౌలింగ్ చేసే ఛాన్స్ ఇస్తే, ధోనీని పెవిలియన్ చేరుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 'ఏదీ, నా బౌలింగ్ లో కొట్టమనండి సిక్సు!' అంటూ సవాల్ కూడా విసురుతున్నాడు. యువరాజ్ సింగ్ ను అమితంగా అభిమానించే ఈ రాంచీ కుర్రాడు సచిన్ ను బ్యాటింగ్ సలహాలు అడగాలని భావిస్తున్నాడు.

  • Loading...

More Telugu News