: నా పార్టీ అధికారంలోకి రాగానే హిందువులు తిరిగి వస్తారు: ఇమ్రాన్ ఖాన్


దేశం నుంచి పారిపోయిన హిందువులందరూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి పాక్ కు వస్తారని ఆ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అంటున్నారు. ఈ మేరకు మాట్లాడుతూ, "దేశంలో దురాగతాలను ఎదుర్కొన్న హిందు కమ్యూనిటీ ప్రజలు నా పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి వస్తారు" అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో దేశంలో బలవంతపు మతమార్పిడిపై స్పందించిన ఇమ్రాన్... హిందువులు, కలాష్ కమ్యూనిటీలను బలవంతంగా ఇస్లాంలోకి మార్పు చేయడంపై విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News