: తూ.గో.జిల్లా బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు... 13 మంది మృతి
తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదమూడుమంది మరణించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు భారీగా ఎగసిపడుతున్న మంటలను రెండు ఫైరింజన్లు అదుపు చేస్తున్నాయి. అనధికారికంగా బాణాసంచా తయారు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అటు క్షతగాత్రులను కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.