: ఆమరణ దీక్షకైనా రెడీ...మా డిమాండ్లు నెరవేర్చుకుంటాం: జూడా జేఏసీ
ఆమరణ నిరాహార దీక్షకైనా తాము సిద్ధంగా ఉన్నామని జూనియర్ డాక్టర్ల జేఏసీ తెలిపింది. హైదరాబాదులో వారు మాట్లాడుతూ, తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని స్పష్టం చేశారు. విద్య పూర్తయిన వెంటనే తమకు ఏ విధమైన అనుభవం లేకుండానే గ్రామాల్లో సేవ చేయాలని ప్రభుత్వం ఆదేశించడం దారుణమని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చర్చల పేరిట బెదిరింపులకు పాల్పడుతోందని వారు తెలిపారు. ఎలాగైనా తమ డిమాండ్ నెరవేర్చుకుంటామని వారు స్పష్టం చేశారు.