: అమిత్ షాతో నితిన్ గడ్కరీ, నేతలతో ఉద్దవ్... సమావేశాలతో బిజీబిజీ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిశారు. మహారాష్ట్రలో అధికారం చేపట్టే దిశగా తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యమంత్రి అభ్యర్థి, పొత్తులు తదితర అంశాలపై వారిద్దరూ తీవ్రంగా చర్చిస్తున్నారు. కాగా, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా? లేక, ప్రధాన ప్రతిపక్షంగానే ఉండాలా? అనే అంశాలను పరిశీలిస్తున్నారు.