: తెలంగాణ స్విమ్మర్ అద్భుత రికార్డు


కొద్దిసేపు నీళ్ళలో ఈదాలంటేనే చాలా కష్టం. అందుకు ఎంతో సాధన కావాలి. కొన్ని గంటల పాటు ఈదిన వ్యక్తులను చూశాం. కానీ, ఈ తెలంగాణ స్విమ్మర్ 24 గంటల పాటు ఈత కొట్టడం ద్వారా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అతని పేరు దిలీప్ కుమార్. స్వస్థలం కరీంనగర్ జిల్లా గోదావరి ఖని. హైదరాబాదు నగర శివారు ప్రాంతం యాప్రాల్ లోని ఓ స్విమ్మింగ్ పూల్ లో శనివారం సాయంత్రం 5.45కి దిలీప్ ఈదడం ప్రారంభించాడు. అది మరుసటి రోజు, అంటే, ఆదివారం సాయంత్రం 5.50 దాకా నిరంతరాయంగా కొనసాగింది. తాజా ఫీట్ దిలీప్ ను ఆసియా విభాగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చేర్చింది. తన తదుపరి లక్ష్యం ఇంగ్లిష్ చానల్ ను ఈదడమేనని చెప్పాడీ యువకిశోరం. కాగా, ఈ రికార్డు నెలకొల్పే క్రమంలో దిలీప్ నిమిషానికి 50 మీటర్ల వేగంతో మొత్తం 75 కిలోమీటర్ల దూరం ఈదడం విశేషం.

  • Loading...

More Telugu News