: నెలాఖరుకి ఉత్తరాంధ్రలో వెలుగులు: విద్యుత్ శాఖ కార్యదర్శి
హుదూద్ తుపాను ధాటికి ఉత్తరాంధ్రలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. సీఎం చంద్రబాబు దగ్గరుండి పునరుద్ధరణ పనులు పర్యవేక్షించినప్పటికీ కేవలం విశాఖ నగరంలోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ జరిగింది. దీంతో, ఇతర ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ప్రక్రియ నెలాఖరుకల్లా పూర్తవుతుందని విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పూర్తికాని ఇతర ప్రాంతాల్లోని ప్రజలకు సోలార్ లాంతర్లు ఇస్తామని ఆయన వివరించారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు మందకొడిగా సాగుతున్నాయని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.