: 'సమగ్ర సర్వే'పై కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో జరిపిన సమగ్ర సర్వేపై ఉమ్మడి హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. మరోవైపు పాలిథిన్ కవర్ల వాడకంపైనా న్యాయస్థానం సీరియస్ అయింది. కవర్ల నిషేధంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ప్రశ్నించింది. మూడు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.