: త్వరలో మైక్రోసాఫ్ట్ స్మార్ట్ వాచ్: ఫోర్బ్స్
ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరికొన్ని వారాల్లో మార్కెట్లోకి స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. అత్యంత ఆధునిక హంగులతో రాబోతున్న ఈ వాచ్ వినియోగదారుల హృదయ స్పందనను ట్రాక్ చేస్తుందని, త్వరలోనే ఇది వివిధ మొబైల్ షోరూంలలో లభిస్తుందని చెప్పింది. ఈ నూతన వాచ్ బ్యాటరీ రెండు రోజులపాటు పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందట. మార్కెట్ లోకి విడుదల చేసిన వెంటనే స్టోర్లలో లభ్యమవుతుందని ఫోర్బ్స్ వివరించింది.