: పది నిమిషాలు చాలు... సంఘటన స్థలికి చేరుకుంటాం: సీపీ మహేందర్ రెడ్డి
ఫోన్ చేసిన పది నిమిషాల్లో సంఘటనా స్థలికి చేరుకునే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాదు పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో ఆయుధ ప్రదర్శనకు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాంతి భద్రతలను పరిరక్షించే క్రమంలో ఈ ఏడాది 653 మంది పోలీసులు మరణించారని చెప్పారు. పోలీసుల కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.