: ఆహారభద్రత కార్డు, పించన్ కోరుతూ అందిన దరఖాస్తులు కోటీ 18 లక్షలు... నేడే చివరి రోజు


ఆహార భద్రత కార్డు, పింఛన్ ను కోరుతూ మొత్తం కోటీ 18 లక్షల దరఖాస్తులు తెలంగాణ ప్రభుత్వానికి అందాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 9 నుంచి ఆహారభద్రత, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండగా, వాటి గడువు నేటితో పూర్తికానుంది. ఇప్పటి వరకు ఆహార భద్రత కోసం 83 లక్షలు, పింఛన్ల కోసం 35 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు సమాచారం. చివరి రోజు కావడంతో ఈ రోజు మరిన్ని దరఖాస్తులు అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News