: కాశ్మీర్ పై మరోసారి బిలావల్ భుట్టో ప్రేలాపనలు
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిలావల్ భుట్టో (26) మరోసారి కాశ్మీర్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్ నుంచి బలవంతంగానైనా కాశ్మీర్ ను తీసుకుంటామని చెప్పాడు. ఈ మేరకు కరాచీలో తన తొలి బహిరంగ సభలో బిలావల్ మాట్లాడుతూ, "ఎప్పుడైతే కాశ్మీర్ అంశాన్ని నేను లేవనెత్తానో హిందుస్థాన్ మొత్తం గొంతెత్తింది. భుట్టో ఎప్పుడు మాట్లాడినా, అందుకు తమ వద్ద సమాధానం ఉండదని వారికి తెలుసు" అని ఈ భుట్టో వారసుడు పేర్కొన్నాడు. ఏది ఏమైనా భారత్ నుంచి కాశ్మీర్ ను తిరిగి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాశ్మీర్ లో శాంతి కోరుకుంటున్నానన్న ఈ యువనేత ఈ అంశంపై తన ప్రకటనలు తప్పుగా అర్ధం చేసుకోకూడదంటున్నాడు.