: ఇక మోడీ సంస్కరణల్లో మరింత వేగం!


మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారులో ఉత్సాహాన్ని నింపాయి. హర్యానాలో తొలిసారిగా అధికార పగ్గాలు చేపడుతున్న బీజేపీ, మహారాష్ట్రలో ఒంటరిగా పోటికి దిగినా... అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో బీజేపీలో ఒక్కసారిగా ఉత్సాహం పెల్లుబికింది. మొన్నటి ఉప ఎన్నికలు మిగిల్చిన చేదు అనుభవాలను తాజా ఫలితాలు మరుగున పడేశాయి. ఈ నేపథ్యంలో మోడీ సర్కారు మరింత దూకుడుగా వ్యవహరించడం ఖాయమని అటు రాజకీయ విశ్లేషకులతో పాటు ఇటు వ్యాపార వర్గాలు అంచనాలేస్తున్నాయి. మరో ఏడాది దాకా దేశంలో ఎక్కడా ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ తన సంస్కరణల వేగాన్ని పెంచడం ఖాయమని కూడా ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు, 2016 కేంద్ర బడ్జెట్ రూపకల్పనకు అప్పుడే శ్రీకారం చుట్టిన మోడీ ప్రభుత్వం, ఆర్థిక వృద్ధి దిశగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు ఎంతమాత్రం వెనుకాడే పరిస్థితి లేదని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News