: ఆ మూడు ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాయి
కేవలం మూడు ఓట్లే కాంగ్రెస్ ఆభ్యర్థిని గెలిపించాయి. హర్యానాలోని సోనేపట్ జిల్లాలోని రాయ్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జై తీరథ్ దహియా తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్ డీ అభ్యర్థి ఇందర్ జిత్ దహియాపై కేవలం మూడు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం జైతీరథ్ కు 36,703 ఓట్లు రాగా, ఇందర్ జీత్ కు 36,700 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 34,523 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం మూడు ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.