: రెండు రాష్ట్రాల్లో బీజేపీ సీఎంలే ఉంటారు: వెంకయ్య


బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హర్షం వెలిబుచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన నాయకత్వ పటిమను చాటుకున్నారని కితాబిచ్చారు. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ముఖ్యమంత్రులే ఉంటారని వెంకయ్య స్పష్టం చేశారు. సీఎంలను ఎంపిక చేసే బాధ్యత పార్లమెంటరీ బోర్డుదేనని అన్నారు. అటు, మహారాష్ట్రలో మద్దతు విషయమై శివసేన పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాకరే ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలతో మాట్లాడారు. మద్దతు విషయమై బీజేపీ నుంచి ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తామని ఉద్ధవ్ తెలిపారు.

  • Loading...

More Telugu News