: రెండు స్థానాల్లో జెండా రెపరెపలాడించిన ఎంఐఎం
అసదుద్దీన్ ఒవైసీ నాయకత్వంలోని మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో జయభేరి మోగించింది. ఔరంగాబాద్ సెంట్రల్ నియోజకవర్గంలో ఇంతియాజ్ అలీ, బైకుల్లా నియోజకవర్గంలో వారిస్ యూసుఫ్ పఠాన్ ఎంఐఎం తరపున పోటీ చేసి ఘనం విజయం అందుకున్నారు. మాజీ పాత్రికేయుడు ఇంతియాజ్ శివసేనకు చెందిన మాజీ ఎంపీ ప్రదీప్ జైస్వాల్ పై 20,000 ఓట్ల తేడా నెగ్గారు. ఇక బైకుల్లాలో వారిస్ తన ప్రత్యర్ధి బీజేపీకి చెందిన మధుకర్ చవాన్ ను 1357 ఓట్ల తేడాతో ఓడించారు.