: పుణేలో బీజేపీ క్లీన్ స్వీప్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మోడీ ప్రభంజనం ఫలితం... పుణేలో క్లీన్ స్వీప్ చేసింది. నగరంలోని 8 అసెంబ్లీ స్థానాలు బీజేపీ ఖాతాలో చేరడం విశేషం. సిట్టింగ్ స్థానాలైన మూడింటిలో జయకేతనం ఎగరేసిన కాషాయదళం కొత్తగా మరో ఐదు స్థానాలను చేజిక్కించుకుంది. అటు, 2009 ఎన్నికల్లో ఇక్కడ నెగ్గిన రెండు స్థానాలను నిలుపుకోవడంలో శివసేన విఫలమైంది. బాల్ థాకరే హయాం నుంచి పార్టీకి కంచుకోటనదగ్గ కొత్రూడ్ నియోజకవర్గంలో పరాజయం శివసేన అధినాయకత్వాన్ని నిరాశకు గురిచేసింది.