: జయను జైల్లో పెట్టినప్పుడు సంతోషించలేదు, బెయిల్ వచ్చినందుకు బాధపడలేదు: కరుణానిధి


తన ప్రధాన ప్రత్యర్థి జయలలిత విషయంలో డీఎంకే అధినేత కరుణానిధి జాగ్రత్తగా స్పందించారు. ఆమెను జైల్లో పెట్టినప్పుడు సంతోషించలేదని, అలాగే, బెయిల్ వచ్చినప్పుడు బాధపడలేదని అన్నారు. జయ వ్యవహారంలో తన మౌనం వెనకున్న కారణాన్ని కరుణానిధి వివరించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ఇది ముఖ్యమైన కేసు అయినందున తీర్పు పూర్తి పాఠాన్ని చదివాకే స్పందించాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ తర్వాతే ఈ కేసుకు ఓ రూపం వచ్చిందని కరుణ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News